బాలీవుడ్ భామతో పవన్, సాయితేజ్ ఐటమ్ సాంగ్!
- ‘బ్రో’ సినిమాలో నటిస్తున్న మామాఅల్లుళ్లు
- సముద్రఖని దర్శకత్వంలో సినిమా
- ఊర్మశీ రౌతేలాతో వచ్చేవారం స్పెషల్ పాట చిత్రీకరణ!
దాంతో, ఐటమ్ సాంగ్స్ లో ఆమెకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ‘బ్రో’ నుంచి కూడా ఆమెకు ఆఫర్ వెళ్లగా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఊర్వశి పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా చూసింది. ఈ విషయాన్ని ఆదివారం స్వయంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లెక్కన ‘బ్రో’ ప్రత్యేక గీతానికి ఊర్వశి రెడీ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ పాటకు సంబంధించి పబ్ సెట్‌ను సిద్ధం చేశారని, దీనికి గణేశ్ మాస్టర్, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.