స్మృతి ఇరానీ కనిపించట్లేదంటూ కాంగ్రెస్ పోస్టర్లు.. రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి కౌంటర్
- తన నియోజకవర్గంలోని సిర్ సిరా గ్రామంలో ఉన్నానంటూ ట్వీట్
- మాజీ ఎంపీ కోసం వెతుకుతుంటే కనుక అమెరికాలో సంప్రదించాలని వ్యగ్యం
- గత ఎన్నికల్లో అమేథి నుంచి పోటీచేసి ఓడిపోయిన రాహుల్ గాంధీ
ఒకవేళ, అమేథి నియోజకవర్గం మాజీ ఎంపీ కోసం వెతుకుతుంటే మాత్రం అమెరికాలో సంప్రదించాలని వ్యంగ్యంగా సూచించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ మంత్రి ఈ కామెంట్లు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అమేథి నియోజకవర్గం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అయితే, కేరళలోని వయనాడ్ నుంచి గెలిచి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఇటీవల ఓ కేసులో శిక్ష పడడంతో రాహుల్ తన సభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అమెరికాలో వున్నారు.