KCR: విశాఖ శారదా పీఠాధిపతితో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో, చందానగర్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో స్వరూపానందేంద్ర సరస్వతిని తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ వెంట శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా ఉన్నారు. ఈ భేటీలో ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా పాల్గొన్నారు. వీరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉల్లాసంగా కనిపించారు.