29 ఏళ్ల గాళ్‌ఫ్రెండ్‌తో బిడ్డను కంటున్న 83 ఏళ్ల హాలీవుడ్ నటుడు!
- 29 ఏళ్ల నూర్ అల్ఫాల్లాతో ఏడాదిగా డేటింగ్
- ఇప్పటికే ఆమెకు ముగ్గురు సంతానం
- నాలుగోసారి తండ్రి కాబోతున్న అమెరికన్ నటుడు
నాలుగోసారి బిడ్డకు జన్మనిస్తున్నట్టు నూర్ నిర్ధారించినట్టు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నూర్ తరచూ డబ్బున్న వృద్ధులతో డేటింగ్ చేస్తూ ఉంటుందని తెలిపాయి. కరోనా సమయంలో పాచినో, నూర్ కలుసుకున్నారని, ఆ తర్వాతి నుంచి ఇద్దరు కలిసి ఉంటున్నట్టు వివరించాయి.
అంతకుముందు ఆమె మిక్ జాగెర్తో కొన్నాళ్లు, ఆ తర్వాత నికోలస్ బెర్గ్యూయెన్తో డేట్ చేసినట్టు పేర్కొన్నాయి. అంతేకాదు, నూర్ గతంలో ఒకసారి క్లింట్ ఈస్ట్‌వుడ్ (92)తో కలిసి కనిపించింది. అయితే, తమ మధ్య డేటింగ్ అంటూ ఏమీ లేదని ఆ తర్వాత ఆమె ఖండించింది.