Venkatesh Daggubati: ‘రానానాయుడు’లోని శ్రుతి మించిన సన్నివేశాలపై ఎట్టకేలకు పెదవి విప్పిన వెంకటేశ్

Actor Venkatesh Responds on Rana Naidu Web Series
షార్ట్స్‌లో చూడండి
వెబ్ సిరీస్ ‘రానానాయుడు’లో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు, అసభ్య డైలాగులపై టాలీవుడ్ ప్రముఖ నటుడు వెంకటేశ్ ఎట్టకేలకు పెదవి విప్పారు. కుటుంబ కథానాయకుడిగా ప్రేక్షకులకు దగ్గరైన వెంకటేశ్‌ను ‘రానానాయుడు’లో అలా చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికపై వెంకటేశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌పై రానా ఇప్పటికే వివరణ ఇవ్వగా, తాజాగా ఇప్పుడు వెంకటేశ్ కూడా స్పందించారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా రూపొందించిన ‘అహింస’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విలేకరులతో మాట్లాడిన వెంకటేశ్.. విలేకరుల బలవంతంతో తొలిసారి ‘రానానాయుడు’పై స్పందించారు. 

రానానాయుడు వెబ్ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోందన్న వెంకటేశ్.. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కంటే ముందుకు వెళ్లడమే మంచిదని అన్నారు. వచ్చే సీజన్‌ను మాత్రం అందరూ ఆకట్టుకునేలా తీస్తామన్నారు. ఫస్ట్ సీజన్‌లో కొన్ని సన్నివేశాలు, వాటిని తీసిన విధానం కొంత ప్రభావం చూపిన మాట వాస్తవమేనని అంగీకరించారు. మొదటి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌కు  ప్రేక్షకులు కచ్చితంగా పెరుగతారని వెంకటేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Venkatesh Daggubati
Rana Naidu
Web Series
Tollywood

More Telugu News