జగన్ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు సెటైరికల్ ట్వీట్
- నేటితో నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న జగన్
- ఏపీ విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమయిందన్న చంద్రబాబు
- ఐదో ఏడాది కూడా విధ్వంసం కొనసాగుతోందని విమర్శ
జగన్ సీఎం అయిన వెంటనే అమరావతిలోని ప్రజావేదికను కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అధికారులతో సమావేశం సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తొలి కూల్చివేత ఈ బిల్డింగ్ తో ప్రారంభమవుతుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు షేర్ చేశారు. 'నిజమే. తొలి రోజు మీరు ఏం చెప్పారో మీ ప్రభుత్వం దాన్నే తు.చ తప్పకుండా అమలు చేస్తోంది. ఏపీ విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమయింది... ఆ విధ్వంసం ఐదో ఏడాది కూడా కొనసాగుతోంది' అని చంద్రబాబు అన్నారు. దీంతోపాటు ప్రజావేదికను కూల్చుతున్న వీడియోను కూడా షేర్ చేశారు.