'నరకాసుర' ఫస్టు గ్లింప్స్ రిలీజ్!
- విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'నరకాసుర'
- రక్షిత్ జోడీగా అపర్ణ జనార్దన్
- ఆసక్తిని రేపుతున్న ఫస్టు గ్లింప్స్
- పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సినిమా
శివుడి నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకి సంబంధించిన షాట్స్ ను ఆవిష్కరిస్తూ, ఆర్ఆర్ పై కట్ చేసిన విజువల్స్ ఆసక్తిని రేకెత్తించేవిగా ఉన్నాయి. కంటెంట్ విషయంలో ఏ అంశాన్ని రివీల్ చేయకుండా ఉత్కంఠను రేకెత్తించే ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాలో నాజర్ ... చరణ్ రాజ్ .. సంకీర్తన ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకి అపర్ణ జనార్దన్ పరిచయం కానుంది. గ్లామరస్ గా కనిపిస్తున్న అపర్ణకి ఈ సినిమా తరువత ఇక్కడ వరుస అవకాశాలు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.