చారిత్రక హౌరా బ్రిడ్జ్ సామర్థ్యాన్ని పరీక్షించనున్న నిపుణులు
- బ్రిడ్జి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం
- మద్రాస్ ఐఐటీ నిపుణుల సాయంతో పరీక్షలు
- జీవిత కాలాన్ని పెంచే విషయమై సమాచారం సేకరణ
‘‘మరింత లోతైన అధ్యయనం నిర్వహించాలని నిర్ణయించాం. ఇలాంటి అధ్యయనం చేసి దశాబ్దం గడిచిపోయింది. బ్రిడ్జి జీవిత కాలాన్ని ఎలా పెంచొచ్చన్న అంశంపై కీలక వివరాలను ఈ అధ్యయనం తెలుసుకునేలా చేస్తుంది’’ అని ఆయన వివరించారు. హౌరా బ్రిడ్జికి రవీంద్ర సేతు అని కూడా పేరు. దీని పొడవు 405 మీటర్లు. 21.6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. 1943లో దీన్ని ప్రారంభించగా, కోల్ కతాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నిత్యం 80వేల వాహనాలు ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తుంటాయి.