త్వరలోనే పవిత్రా లోకేశ్ ను పెళ్లి చేసుకుంటా: నరేశ్
- నిజానికి పెళ్లి అనేది అంత కచ్చితంగా అవసరం లేదన్న నరేశ్
- ఇద్దరి మనసులు కలవడంతో కలిసి ఉంటున్నామని వెల్లడి
- తమకు ఇంకా పెళ్లి కాలేదని, త్వరలోనే చేసుకుంటామని వ్యాఖ్య
‘‘నిజానికి పెళ్లి అనేది అంత కచ్చితంగా అవసరం లేదు. చాలా మంది ఇష్టం లేకుండా, సమాజం కోసం పెళ్లి అనే బంధంలో ఉంటున్నారు. అలాంటి వారికోసమే 'మళ్లీ పెళ్లి' సినిమా’’ అని అన్నారు. ‘‘నాకు, పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరి అభిప్రాయాలు, మనసులు కలవడంతో కలిసి ఉంటున్నాం. అందరి ఆశీస్సులతో త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు.
‘మళ్లీ పెళ్లి’ సినిమాలో పవిత్రా లోకేశ్, వనితా విజయ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని పెంచింది.