'ప్రాజెక్టు K' ప్రపంచాన్ని ఊపేస్తుంది: నందినీ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప్రాజెక్టు K' ప్రపంచాన్ని ఊపేస్తుంది: నందినీ రెడ్డి

Nandini Redddy Interview
  • తన సినిమా ప్రమోషన్స్ లో నందినీ రెడ్డి 
  • ప్రభాస్ తో సినిమా చేయాలనుందంటూ మనసులో మాట 
  • 'ఆదిపురుష్' సంచలం సృష్టిస్తుందని వ్యాఖ్య 
  • 'ప్రాజెక్టు K' ప్రపంచాన్ని ఊపేస్తుందని వెల్లడి
ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కించడంలో నందినీ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. ఆమె తాజా చిత్రమైన 'అన్నీ మంచి శకునములే' సినిమా, ఈ నెల 18వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉన్నారు. ఈ సందర్భంలోనే ఆమె ప్రభాస్ ను గురించి ప్రస్తావించారు. 

"చాలాకాలం తరువాత టీవీలో 'డార్లింగ్' చూశాను. ఆ సినిమాలో కొన్ని సీన్స్ ను ఎంతో క్యూట్ గా చేశాడు. యాక్షన్ సీన్స్ ను ఎంత ఇంపాక్ట్ తో చేశాడో .. క్యూట్ సీన్స్ ను అంతే లవ్లీగా చేశాడు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు చాలా పెద్ద స్టార్ అయ్యాడు. ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టుకుని ... ఒక యాక్షన్ ఎలిమెంటును పట్టుకుని ఆయనతో ఒక సినిమా అయితే చేయాలనుంది" అన్నారు. 

ప్రభాస్ నుంచి ప్రపంచాన్ని ఊపేసే 'ప్రాజెక్టు K' రాబోతోంది. ఆ సినిమా తరువాత ఆయన రేంజ్ ఎంతవరకూ వెళ్లబోతుందో చూడాలి. అంతకంటే ముందుగానే 'ఆదిపురుష్' సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లో ట్రైలర్ చూస్తూ అలా ఉండిపోయాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Advertisement
Nandindi Reddy
Prabhas
Project K

More Telugu News