Andhra Pradesh: రోడ్డు ప్రమాదం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

TDP former mla kandula narayana reddy injured in accident
షార్ట్స్‌లో చూడండి
ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద కారు బోల్తా పడటంతో నారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. 

యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన కారు డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు.
Go Back to Shorts
Andhra Pradesh

More Telugu News