Kerala: ట్రాఫిక్ చలానాతో బయటపడిన భర్త బండారం.. భార్య ఫిర్యాదుతో జైలు పాలు!

Kerala man lands in trouble after wife receives traffic CCTV pics with lady friend
షార్ట్స్‌లో చూడండి
హెల్మెట్ లేకుండా స్కూటీపై ప్రయాణించిన ఓ వ్యక్తి బండారం బట్టబయలు కావడంతో భార్య ఆగ్రహానికి గురయ్యాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు జైలు పాలయ్యాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు కేరళ ట్రాఫిక్ పోలీసులు ఓ వ్యక్తికి జరిమానా విధించారు. సీసీటీవీ కెమెరాకు చిక్కిన అతడి ఫొటోలను కూడా పంపించారు. స్కూటీ భార్య పేర రిజిస్టర్ అయి ఉండటంతో ఈ జరిమానా వివరాలు, భర్త ఫొటో అతడి భార్యకు అందాయి. అయితే, ఆ ఫొటోల్లో భర్త మరో మహిళతో కలిసి ప్రయాణించడం ఆమె కంట పడింది. 

ఈ విషయమై ఆమె అతడిని నిలదీసింది. కానీ, తాను ఏ తప్పూ చేయలేదని అతడు భార్యకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దారిన పోయే మహిళకు తాను లిఫ్ట్ మాత్రమే ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కానీ, అతడి వివరణతో భార్య సంతృప్తి చెందకపోవడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు మే 5న భర్తపై ఆమె కారామానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి  జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Go Back to Shorts
Kerala

More Telugu News