Balagam: బాలయ్యతో ‘బలగం’ వేణు సినిమా?

చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో అడుగు పెట్టి, హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకన్న వేణు ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారాడు. తన తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ పల్లె సంస్కృతి, కుటుంబాలను కళ్లకు కట్టి పలు అంతర్జాతీయ అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. దీంతో, ఇప్పుడు వేణు తీయబోయే రెండో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతనితో చేయడానికి పలువురు అగ్ర నిర్మాతలు, హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. 

దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే తన తదుపరి సినిమా ఉంటుందని వేణు ఇదివరకే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో తన రెండో సినిమానే బడా హీరో నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం లభించిందని తెలుస్తోంది. బాలయ్యకు ఇప్పటికే కథ చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించారని టాలీవుడ్ సమాచారం. అదే నిజమైతే ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ కానుంది. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.
Balagam
venu
Balakrishna
Dil Raju

More Telugu News