హోమ్లీ బ్యూటీ గ్లామర్ షో.. రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు, వీడియో వైరల్!

Rukmini Vasanth Glamour Photos Viral Swimming Pool Pictures Spark Debate
  • ఎన్టీఆర్, యశ్‌లతో పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న రుక్మిణి
  • సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ బికినీ విజువల్స్ వైరల్
  • హోమ్లీ ఇమేజ్‌కు భిన్నంగా గ్లామర్ అవతారంలో కనిపించిన నటి
  • ఇది నిజమైన ఫోటోషూటా? లేక డీప్‌ఫేకా? అని నెటిజన్ల మధ్య చర్చ 
  • వైరల్ వీడియోపై ఇంకా స్పందించని నటి, ఆమె పీఆర్ టీమ్
‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన నటన, అమాయకపు చూపులతో కట్టిపడేసిన కన్నడ నటి రుక్మిణి వసంత్, ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమెకు సంబంధించిన కొన్ని బికినీ విజువల్స్ ఇంటర్నెట్‌లో లీక్ కావడమే దీనికి కారణం. హోమ్లీ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె, ఒక్కసారిగా గ్లామర్ అవతారంలో కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ప్రస్తుతం రుక్మిణి వసంత్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. 'కాంతార' సీక్వెల్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సరసన 'డ్రాగన్', రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఆమె గ్రీన్ కలర్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్న వీడియో క్లిప్స్, ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అయితే, ఈ విజువల్స్‌లో ఆమె చుట్టూ ప్రొఫెషనల్ కెమెరామెన్లు, లైటింగ్ సిబ్బంది ఉండటంతో ఇది ఏదైనా అంతర్జాతీయ బ్రాండ్ లేదా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం జరిపిన అధికారిక ఫోటోషూట్ అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లామర్ పాత్రలకు కూడా తాను సిద్ధమేనని రుక్మిణి ఈ షూట్‌తో చెప్పకనే చెబుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

నిజమా?.. డీప్‌ఫేకా? 
మరోవైపు ఈ వీడియో, ఫొటోలపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. దాంతో ఇది కూడా డీప్‌ఫేక్ మాయాజాలం అయి ఉండవచ్చని మరో వర్గం వాదిస్తోంది. అభిమానులు సైతం 'ఇది నిజంగా రుక్మిణేనా?' అంటూ అయోమయంలో పడ్డారు. భారీ చిత్రాలతో కెరీర్‌లో దూసుకెళ్తున్న తరుణంలో ఈ తరహా వీడియోలు లీక్ కావడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ వైరల్ కంటెంట్‌పై ఇప్పటివరకు నటి రుక్మిణి వసంత్ గానీ, ఆమె పీఆర్ టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ ఇది నిజమైన షూట్ అయితే, రుక్మిణి గ్లామర్ డోస్ పెంచి స్టార్ హీరోయిన్ల రేసులోకి అడుగుపెట్టినట్లేనని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఈ హాట్ టాపిక్‌పై పూర్తి స్పష్టత రావాలంటే ఆమె స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
Go Back to Shorts
Rukmini Vasanth
Sapta Sagaralu Dhaati
Kantara
NTR Dragon Movie
Toxic Yash Movie
Bikini Photoshoot
Swimming Pool Video
Deepfake
Viral Video
Kannada Actress

More Telugu News