హైదరాబాద్‌లో ఇద్దరు రౌడీషీటర్ సోదరులపై పీడీ యాక్ట్

VC Sajjanar PD Act invoked against two rowdy sheeter brothers in Hyderabad
  • హత్యలు, వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసుల ఆరోపణ
  • బెయిల్‌పై విడుదలై మళ్లీ నేరాలు చేస్తున్నారని వెల్లడి
  • నిందితులను అరెస్ట్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇద్దరు రౌడీషీటర్ సోదరులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ నమోదు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒమర్‌ బిన్‌ హంజా అల్‌ జాబ్రి, అలీ బిన్‌ హంజా అల్‌ జాబ్రి అనే అన్నదమ్ములపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

గత కొంతకాలంగా ఈ సోదరులు హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని సీపీ పేర్కొన్నారు. ఆయుధాలతో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒమర్‌ బిన్‌ హంజాపై 8 క్రిమినల్ కేసులు, అలీ బిన్‌ హంజాపై 7 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. 

గతంలో పలు కేసుల్లో అరెస్టయిన వీరు, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా నేర కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని రెయిన్‌బజార్ పోలీసులు నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు సజ్జనార్ తెలిపారు. సీపీ ఆదేశాలతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 
 
Go Back to Shorts
VC Sajjanar
Hyderabad
Rowdy sheeters
PD Act
Preventive Detention Act
Crime
Rain Bazar Police Station
Omar Bin Hamza Al Jabri
Ali Bin Hamza Al Jabri
Telangana

More Telugu News