చేతిలో ఉన్న ఊతకర్ర విసిరేసి చలాకీగా నడిచిన పంత్... వీడియో వైరల్!
- గతేడాది డిసెంబరులో పంత్ కు రోడ్డు ప్రమాదం
- తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు
- సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో తప్పిన ప్రాణాపాయం
- చాలారోజుల పాటు మంచానికే పరిమితం
- తాజాగా వాకింగ్ స్టిక్ లేకుండానే నడుస్తున్న పంత్
అయితే, తాజా వీడియో పంత్ అభిమానులను కచ్చితంగా సంతోషానికి గురిచేస్తుంది. చేతిలో ఉన్న ఊతకర్రను అక్కడే ఉన్న వ్యక్తిపైకి విసిరేసిన పంత్ కాస్త హుషారుగా నడవడం ఈ వీడియోలో చూడొచ్చు.
దీనిపై నెటిజన్లు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. పంత్ ను మళ్లీ ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉందని, టీమిండియాలోకి అతడి పునరాగమనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.