బీహార్ ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల భారీ జరిమానా
- వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఫైన్
- రెండు నెలల్లో ఈ మొత్తం జమ చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
- ఈ డబ్బును వేస్ట్ మేనేజ్మెంట్ కు వినియోగించాలని సూచన
ఈ మొత్తాన్ని రెండు నెలల్లో రింగ్ ఫెన్స్డ్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని, ఈ ఖాతా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధీనంలో ఉంటుందని, సీఎస్ ఆదేశాల మేరకు ఈ ఖాతాలోని మొత్తాన్ని వేస్ట్ మేనేజ్ మెంట్ కు మాత్రమే వినియోగించాలని గ్రీన్ ట్రైబ్యునల్ తెలిపింది. గత ఏడాది బెంగాల్ ప్రభుత్వానికి కూడా రూ.3,500 కోట్ల జరిమానా విధించింది గ్రీన్ ట్రైబ్యునల్.