Sharad Pawar: బిగ్ బ్రేకింగ్.. ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా
- మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన మలుపు
- తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ
- శరద్ పవార్ కొనసాగాలంటున్న పార్టీ శ్రేణులు
దేశ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. మన దేశంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల మహాకూటమి ఏర్పాటులో కూడా పవార్ దే కీలక పాత్ర అనే విషయం గమనార్హం. దేశ రాజకీయాల్లో సైతం ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి కీలక నేత ఇంత హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది.
మరోవైపు ఆయన వారసుడిగా పార్టీ తదుపరి అధ్యక్ష బాధ్యతలను ఎవరు తీసుకోబోతున్నారనే విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు. ఇంకోవైపు పార్టీ అధ్యక్షడిగా శరద్ పవార్ కొనసాగాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో శరద్ పవార్ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.