14 మొబైల్ యాప్స్ పై నిషేధం
- పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద ముఠాల ఎత్తులకు చెక్
- ఈ యాప్ ల ద్వారా జమ్మూ కశ్మీర్లోని కేడర్ కు సమాచారం
- దేశ భద్రత కోణంలో నిషేధిస్తూ నిర్ణయం
క్రిప్ వైజర్, ఎనిగ్మా, సేఫ్ స్విస్, విక్ఆర్ఎంఈ, మీడియా ఫైర్, బ్రియర్, బీ చాట్, నాండ్ బాక్స్, కోనియన్, ఐఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగి, త్రీమ నిషేధం వేట పడిన యాప్స్ లో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే క్షేత్రస్థాయి కేడర్ కు సమాచారం పంపుకునేందుకు ఈ యాప్స్ ను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేంద్ర సర్కారు గతంలోనూ వందల సంఖ్యలో మొబైల్ యాప్స్ ను నిషేధించింది. దేశ భద్రతకు విఘాతం అనుకున్న ప్రతి యాప్ పై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో 250 చైనా యాప్ ల కూడా ఉన్నాయి.