కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని

Perni Nani lauds fellow parrt man Kodali Nani
  • ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని, పేర్ని నాని
  • కొడాలి నాని పైకి పిచ్చోడిలా కనిపిస్తాడన్న పేర్ని నాని
  • కానీ అతడే అందరికంటే తెలివైన వాడని వెల్లడి
  • కొడాలి నాని బుర్ర పాదరసం కంటే వేగవంతమైనదని వ్యాఖ్యలు
కొడాలి నాని పైకి పిచ్చోడి మాదిరిగా, ఏమీ తెలియని అమాయకుడిలా కనిపిస్తాడని పేర్ని నాని అన్నారు. ఓ కార్యక్రమానికి కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని తన పార్టీ సహచరుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"చూసేవాళ్లకు కొడాలి నాని పెద్దగా చదువుకోని వాడిలా కనిపిస్తాడు. అతను కూడా నేను 7వ తరగతి చదివాను, 10వ తరగతి చదివాను అని చెబుతుంటాడు. ఇవన్నీ డ్రామా మాటలు! మెడలో రుద్రాక్షలు, గడ్డంతో రౌడీ గెటప్ లా ఉంటుంది. కానీ పాదరసం కంటే వేగంగా నడిచే బుర్ర, ఆలోచనలు అతడికున్నాయి. 

నేను చూసిన వాళ్లలో ఈ రాష్ట్రంలోనే అత్యంత తెలివైన రాజకీయ నాయకుడు కొడాలి నానినే. ఆయన గురించి తెలియని శత్రువులు... ఏదో రెండ్రోజులు వస్తాడు... పిచ్చోడి మాదిరిగా తిరిగి వెళుతుంటాడు అనుకుంటారు. గడ్డం పెంచుతాడు, నోట్లో కిళ్లీ వేస్తాడు అనుకుంటారు... కానీ వాళ్లందరికీ కొడాలి నాని ఇప్పటికే స్కెచ్ లు సిద్ధం చేశాడు. 

వచ్చే ఎన్నికల్లోనూ నానిదే గెలుపు. ఐదోసారి కూడా అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎలా పాతుకుపోయాడో, కొడాలి నాని కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు" అని కొనియాడారు
Go Back to Shorts
Perni Nani
Kodali Nani
YSRCP
Gudivada
Andhra Pradesh

More Telugu News