రెడ్‌మీ ఫోన్ పేలుడుతో చిన్నారి మృతి ఘటనపై స్పందించిన కంపెనీ
- కేరళలోని త్రిసూర్ జిల్లాలో 8 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్ పేలుడుతో దుర్మరణం
- రెడ్‌మీ ఫోన్లో వీడియో చూస్తుండగా పేలుడు సంభవించినట్టు వెల్లువెత్తిన ఆరోపణ
- ఘటనపై తాజాగా స్పందించిన రెడ్‌మీ ఫోన్ల మాతృ సంస్థ
- ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు పోలీసులకు సహకరిస్తామని వెల్లడి
- బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
త్రిసూర్ జిల్లాకు చెందిన ఆ బాలిక చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని వీడియో చూస్తుండగా పేలుడు సంభవించి, మృతి చెందింది. బాలిక వద్ద ఉన్నది రెడ్‌మీ ఫోన్ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది నిజమా? కాదా? అన్నది పోలీసులు ఇంకా తేల్చాల్సి ఉంది.