మెరుగుపడిన శరత్ బాబు ఆరోగ్యం.. ఐసీయూ నుంచి రూమ్ కు తరలింపు

  • ఇటీవల అనారోగ్యానికి గురైన శరత్ బాబు
  • బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స
  • అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
సీనియర్ సినీ నటుడు శరత్ బాబు ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. అస్వస్థతకు గురైన ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. బెంగళూరు ఆసుపత్రిలో ఆయన కొంత వరకు కోలుకున్నారని ఆయన సన్నిహితులు కూడా ప్రకటించారు. అయితే అక్కడి ఆసుపత్రిలో ఉండగానే మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమించడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో ఆయనను ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు. 

1973లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు దక్షిణాదిన అన్ని భాషల్లో నటించారు. ఇప్పటి వరకు 250కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా మూడు నంది పురస్కరాలు కూడా దక్కాయి.

Sharath Babu
Health
Tollywood

More Telugu News