త్వరలో వచ్చేస్తున్న 'రానా నాయుడు' సీజన్ 2
- కొంతకాలం క్రితం నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'రానా నాయుడు'
- ముంబై నేపథ్యంలో నడిచే కథాకథనాలు
- సెలబ్రిటీల జీవితంలోని చీకటి కోణాలు
- త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న సీజన్ 2
ఈ వెబ్ సిరీస్ అంతా కూడా ముంబై నేపథ్యంలో జరుగుతుంది. కొంతమంది సెలబ్రిటీస్ జీవితాల్లోని చీకటి కోణాలను ఈ వెబ్ సిరీస్ ఆవిష్కరించింది. వెబ్ సిరీస్ లలో బూతులకి కొదవ ఉండటం లేదు. అయితే వెంకటేశ్ - రానాకి ఇక్కడ క్రేజ్ కారణంగా ఇలాంటి కంటెంట్ ను వాళ్లు జీర్ణించుకోలేకపోయారు.
సీజన్ 1 విషయంలో విమర్శలు బాగానే వినిపించాయి. ఇక ఇప్పుడు సీజన్ 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు ఒక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా వదిలారు. సీజన్ 2 ఎలాంటి టాక్ మూటగట్టుకుంటుందనేది చూడాలి.