Uttar Pradesh: యూపీలో పరీక్ష రాసొస్తున్న యువతిపై పట్టపగలు కాల్పులు, హత్య

Girl returning from Exams shot dead in broad day light in up
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బీఏ పరీక్ష రాసి తిరిగొస్తున్న ఓ యువతిపై ముసుగు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. జలాన్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. మృతురాలిని రోష్ణీ అహిర్వార్‌గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం..సోమవారం యువతి పరీక్ష రాసేందుకు వెళ్లింది. ఆ తరువాత ఇంటికి తిరిగొస్తుండగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఆమెను సమీపించారు. వారిలో ఒకరు ఆమె తలపై నేరుగా కాల్పులు జరిపి పారిపోయారు. అక్కడున్న కొందరు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. నిందితులు తుపాకీని ఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించిన పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Uttar Pradesh

More Telugu News