బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం
- మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు
- ట్విట్టర్ లో వెల్లడించిన ఎమ్మెల్సీ కవిత
- త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులు
‘నా కాలికి గాయం అవ్వడంతో మూడు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎప్పటిలానే సహాయ సహకారాల కోసం, సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది’ అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. కాగా, కవితకు గాయం అయిందని తెలిసి ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు.. కవిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.