మార్కాపురంలో రూపాయికే బిర్యానీ ఆఫర్.. ఎగబడిన జనం.. ట్రాఫిక్ జామ్!

Dum Biryani offer for old one rupee note in Markapuram
రూపాయికే దమ్ బిర్యానీ అంటే ఎగబడకుండా ఉంటారా? జనం పొలోమంటూ వచ్చేశారు. దీంతో తోపులాటలు, ట్రాఫిక్ జామూ. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగిందీ ఘటన. పట్టణంలో నిన్న ఓ రెస్టారెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. 

పాత రూపాయి నోటుకు దమ్ బిర్యానీ అంటూ ప్రచారం చేసింది. అంతే.. బిర్యానీ ప్రియులు ఆగమేఘాల మీద రెస్టారెంట్ ముందు వాలిపోయారు. పిల్లల నుంచి పెద్దల వరకు బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. దీంతో తోపులాట జరిగింది. మార్కాపురం-కంభం రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. జనం తాకిడికి తట్టుకోలేకపోయిన రెస్టారెంట్ యాజమాన్యం మధ్యాహ్నం వరకు బిర్యానీ పంపిణీ చేసి ఆ తర్వాత నిలిపివేసింది. రెస్టారెంట్ ముందు జనం తోపులాటలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి.

Go Back to Shorts
Prakasam District
Markapur
Dum Biryani

More Telugu News