ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ఛార్జ్ షీట్ వేసిన ఈడీ 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్ర, రాజేశ్ జోషిలపై ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. ఫిబ్రవరి 7వ తేదీన గౌతమ్ మల్హోత్ర, 8న రాజేశ్ జోషి, 10న మాగుంట రాఘవను అరెస్ట్ చేసినట్టు ఈ ఛార్జ్ షీట్ లో ఈడీ తెలిపింది. ఈ అనుబంధ ఛార్జ్ షీట్ పై ఈ నెల 14న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది. కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ అనుబంధ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకోవాలో, లేదో అనే విషయాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చనుంది.

Enforcement Directorate
Delhi Liquor Scam

More Telugu News