గుజరాత్ టైటాన్స్ కు 163 రన్స్ టార్గెట్ నిర్దేశించిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టైటాన్స్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసిన ఢిల్లీ
- రాణించిన అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, వార్నర్, పోరెల్
సర్ఫరాజ్ ఖాన్ 30, అభిషేక్ పోరెల్ 20 పరుగులు చేయగా, ఆఖర్లో అక్షర్ పటేల్ దూకుడుగా ఆడడంతో ఢిల్లీ స్కోరు 150 మార్కు దాటింది. అక్షర్ పటేల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ పోరెల్ 2 సిక్సులు బాదాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ 3, రషీద్ ఖాన్ 3, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీశారు.