ఇంకా కొందరిని కలిసిన తర్వాత మాట్లాడతా: పవన్ కల్యాణ్

Pawan Kalyan meeting with Muralidharan concludes
  • ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్
  • నాదెండ్లతో కలిసి ఏపీ బీజేపీ ఇన్చార్జితో సమావేశం
  • గంటన్నరపాటు సాగిన సమావేశం
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సాయంత్రం పవన్, నాదెండ్ల మనోహర్ తో కలిసి ఏపీ బీజేపీ ఇన్చార్జి మురళీధరన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. మురళీధరన్ తో పవన్, నాదెండ్ల గంటన్నరపాటు సమావేశమయ్యారు. 

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మురళీధరన్ తో చర్చించారు. జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ అంశాలపై ఈ భేటీలో ప్రస్తావించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ఇంకా పలువురిని కలవాల్సి ఉందని వెల్లడించారు. అందరినీ కలిసిన తర్వాత వివరంగా మాట్లాడతానని తెలిపారు.
Go Back to Shorts
Pawan Kalyan
Nadendla Manohar
Muralidharan
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News