ఆసుపత్రిలో షాకింగ్ దృశ్యం.. వీధి కుక్క నోట నవజాత శిశువు
- కర్ణాటకలో వెలుగులోకొచ్చిన భయానక ఘటన
- శివమొగ్గలోని ప్రభుత్వాసుపత్రి పరిసరాల్లో నవజాత శిశువును నోటపట్టి కుక్క సంచారం
- కుక్కల బెడదపై స్థానికుల్లో ఆందోళన
కాగా, వీధి కుక్క బారిన పడి శిశువు మరణించిందా లేక చిన్నారి మృతదేహాన్ని కుక్క ఎక్కడి నుంచైనా తీసుకొచ్చిందా అన్ని కోణంలో అధికారులు విచారిస్తున్నారు. శిశువు తల్లిదండ్రులు ఎవరో కూడా ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందో పోస్ట్మార్టం తరువాత తెలుస్తుందని వారు చెప్పారు. ఇప్పటికే అధికారులు సమీప ఆసుపత్రుల్లో ప్రసవానికి వచ్చిన మహిళల వివరాలు సేకరిస్తున్నారు.