ఢిల్లీలో పవన్ కల్యాణ్.. అమిత్ షా, నడ్డాలతో భేటీ కానున్న జనసేనాని
- నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న పవన్, నాదెండ్ల మనోహర్
- ఉదయ్ పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన జనసేనాని
- ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్న పవన్ ఢిల్లీ టూర్
టీడీపీతో పొత్తుకు జనసేన సిద్ధమవుతోందని ఇప్పటికే అందరూ భావిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలను పవన్ కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో జనసేన, బీజేపీల మధ్య ప్రస్తుతం పొత్తు ఉన్నప్పటికీ, రెండు పార్టీలు కలిసి పనిచేయడం మాత్రం జరగడం లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి జనసేన అభిమానులు ఓటు వేయలేదని బీజేపీ నేత మాధవ్ బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే భేటీలతో ఏవైనా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయా అనే ఆసక్తి నెలకొంది.