Pawan Kalyan: రాజధాని రైతులకు మద్దతిస్తే దాడి చేస్తారా?: పవన్ కల్యాణ్

ఉద్ధండరాయునిపాలెం వద్ద బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై దాడి జరగడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాజధాని రైతులకు మద్దతిస్తే దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి సరికాదని తెలిపారు. 

ఈ దాడి ఘటనను బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించాలని సూచించారు. దాడి ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ తెలిపారు. వైసీపీ దౌర్జన్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.
Pawan Kalyan
Sathya Kumar
Attack
Janasena
BJP

More Telugu News