విదేశీ యువతికి సాయం చేసేందుకు ట్రాక్‌పైకి దూకాడు.. వీడియో ఇదిగో!
- రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య పడిన దుపట్టాను అందించిన వ్యక్తి
- సాయం చేశాక కృతజ్ఞత కోసం కూడా ఆగకుండా వెళ్లిపోయిన వైనం
- ఆయనే నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
- సోషల్ మీడియాలో 41 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన వీడియో
ప్రస్తుత సమాజంలో ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి ఓ మంచి మనసున్న ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఓ ఇండోనేషియా యువతికి సహాయం చేసేందుకు ఆయన ఏమాత్రం ఆలోచించకుండా రైల్వే ట్రాక్‌పైకి దూకాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే, @indaha.l అనే ఇండోనేషియా డిజిటల్ క్రియేటర్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు వద్ద నిల్చుని ఉంది. ఈ క్రమంలో ఆమె కెమెరాను సర్దుకుంటుండగా తన దుపట్టా రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీలో పడిపోయింది. ఆమె ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉండగానే, అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించారు.
మొదట చేత్తో తీయడానికి ప్రయత్నించినా దుపట్టా అందలేదు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రాక్‌పైకి దూకి, దుపట్టాను తీసి ఆ యువతికి అందించాడు. ఆ తర్వాత ఆమె సాయం చేయబోయినా సున్నితంగా తిరస్కరించి, ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కాడు. కనీసం ఆమె చెప్పే కృతజ్ఞతల కోసం కూడా ఆగకుండా తన దారిన తాను నిశ్శబ్దంగా వెళ్లిపోయారు.
ఈ ఊహించని సహాయానికి ఆశ్చర్యపోయిన ఆ యువతి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ "ఆయన ట్రాక్‌పైకి దూకుతారని అస్సలు ఊహించలేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఆయనకు నా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చింది. ఈ వీడియోకు ఇప్పటికే 41 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆయన మంచితనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. "ఆయన ఒక హీరోలా నడిచి వెళ్లారు", "ఆ యువతి చేతిని సాయం కోసం కూడా పట్టుకోలేదు, ఆయనే నిజమైన జెంటిల్‌మన్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. భారత్‌పై పాక్ కొత్త ఉగ్ర వ్యూహం
![]()
విద్యాశాఖలో కీలక మార్పులు.. టీచర్ల సమస్యలపై సీఎం రేవంత్ హామీ
![]()
ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అయ్యన్నపాత్రుడు
![]()
రాజ్యాంగం కల్పించిన ఆ స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా?: అసదుద్దీన్ ఒవైసీ
![]()
వర్షాకాలంలో బట్టలకు ఆ కంపు వాసన ఎందుకు వస్తుంది? ఇలా చేస్తే సమస్యకు చెక్!
![]()
ఉపాధ్యాయుల కంటతడి ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి మంచిది కాదు: బండి సంజయ్
![]()
60 ఏళ్లకు రూ.10 కోట్లు కావాలా? ఏ వయసులో ఎంత సిప్ చేయాలో తెలుసా?
![]()
'ఉన్మాదం' (సోనీ లివ్) మూవీ రివ్యూ!
![]()
గ్లోబల్ లీడర్లలో మోదీ అత్యంత స్ఫూర్తిదాయకం: బెల్జియం ప్రధాని ప్రశంసల వర్షం
![]()
ముదురుతున్న యుద్ద మేఘాలు: సౌదీ అరేబియాకు 5 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్
![]()
సీఎస్కే కెప్టెన్ మారనున్నాడా? తెరపైకి మరో స్టార్ బ్యాటర్ పేరు..!
![]()
కావాలనే విమానాన్ని సముద్రంలో ముంచిన టర్కీ.. ఎందుకీ వింత ప్రయోగం?
![]()
అది విద్యా వ్యవస్థా లేక కార్పొరేట్ దోపిడీ వ్యవస్థా?: ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల మోతపై రేవంత్‌ను నిలదీసిన కవిత
![]()
రిజ్వాన్, ఇమామ్‌లపై వేటు వ్యవహారంలో పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ షాకింగ్ కామెంట్స్
![]()
‘నేను ఇంతకాలం జీవిస్తా’.. మీ అంచనాకు, నిజమైన జీవితకాలానికి లింక్ ఉందట!
![]()