నెదర్‌లాండ్స్ పర్యాటకురాలిపై గోవాలో కత్తితో దాడి
- గోవా హోటల్‌లో పర్యాటకురాలి బస
- మహిళతో అర్ధరాత్రి అసభ్యంగా ప్రవర్తించిన హోటల్ ఉద్యోగి
- తనను అడ్డుకున్నందుకు పర్యాటకురాలితో పాటూ స్థానికుడిపై కత్తితో దాడి
- మహిళ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
బాధితురాలు భయంతో కేకలు వేయడంతో స్థానిక వ్యక్తి ఒకరు వచ్చి అతడిని అడ్డుకున్నారు. దీంతో..అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిందితుడు మళ్లీ రాడని అనుకుంటున్న తరుణంలో కత్తి తీసుకుని వచ్చిన అతడు తనను అడ్డుకున్న వ్యక్తితోపాటూ మహిళపై కూడా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన వాడని, గత రెండేళ్లుగా అతడు అదే హోటల్‌లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.