Salman Khan: బతుకమ్మ పాటలో సందడి చేసిన పూజ హెగ్డే!

Kisi Ka Bhai Kisi Ki Jaan Song released
షార్ట్స్‌లో చూడండి
సల్మాన్ ఖాన్ హీరోగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా రూపొందింది. ఇది 2014లో అజిత్ చేసిన 'వీరమ్' సినిమాకి రీమేక్. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళంలో భారీ విజయాన్ని సాధించింది. అత్యధిక వసూళ్లను సాధించిన అజిత్ సినిమాలలో ఇది ఒకటిగా నిలిచింది.

మాస్ యాక్షన్ తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. అలాంటి ఈ సినిమానే సల్మాన్ హీరోగా హిందీలో రీమేక్ చేశారు. ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సల్మాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, ఫర్హాద్ దర్శకత్వం వహించాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు. 'బతుకమ్మ' నేపథ్యంలో ఈ పాట సాగడం విశేషం. సల్మాన్ .. వెంకటేశ్ .. పూజ హెగ్డే .. భూమికపై ఈ పాటను చిత్రీకరించారు. కలర్ఫుల్ గా సాగిన ఈ పాటకి కొరియోగ్రఫీ బాగుంది. జగపతిబాబు .. భాగ్యశ్రీ .. మాళవిక నాయర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, ఒక పాటలో చరణ్ మెరవనుండటం విశేషం 

Go Back to Shorts
Salman Khan
Pooja Hegde
Venkatesh Daggubati
Jgapathi Babu

More Telugu News