మరోసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన కొడాలి నాని

Kodali Nani fires on Chandrababu
  • చంద్రబాబు ఒక 420 అన్న కొడాలి నాని
  • ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సిగ్గులేకుండా చంద్రబాబు వెనుక తిరుగుతున్నారని విమర్శ
  • చంద్రబాబు కనుసన్నల్లోనే అమరావతి రైతుల యాత్ర కొనసాగిందని ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అయితే... చంద్రబాబు ఒక 420 అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన చంద్రబాబు... ఆయన బతికుండగానే సీఎం పదవి నుంచి తప్పించారని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెడతాడని చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని తెలిపారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం సీటును లాక్కున్నారని దుయ్యబట్టారు. 

ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెప్పుకుంటున్నవాళ్లు సిగ్గులేకుండా చంద్రబాబు వెనుక తిరుగుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ లా చాలా పౌరుషం ఉన్న వ్యక్తి హరికృష్ణ మాత్రమేనని చెప్పారు. ఎన్టీఆర్ లా సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయిన వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబుకు స్వార్థం ఎక్కువని... ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఇప్పుడు కూడా ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగిందని ఆరోపించారు.
Go Back to Shorts
Kodali Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News