భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి .. 'మీటర్' ట్రైలర్ డైలాగ్!
Add ap7am to your home Screen

భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి .. 'మీటర్' ట్రైలర్ డైలాగ్!

Meter trailer released
  • మాస్ యాక్షన్ జోనర్లో రూపొందిన 'మీటర్'
  • కిరణ్ జోడీగా పరిచయమవుతున్న అతుల్య రవి
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న సాయికార్తీక్ సంగీతం
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల  
నాని తరువాత ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోగా కిరణ్ అబ్బవరం కనిపిస్తాడు. ఆయన వరుస సినిమాలు చేయడం ఒక విశేషమైతే, ఆ సినిమాలు పెద్ద బ్యానర్లలో ఉండటం మరో విశేషం. అలా ఆయన క్లాప్ - మైత్రీ బ్యానర్లలో చేసిన సినిమానే 'మీటర్'. 

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో ఆయన జోడీగా అతుల్య రవి అలరించనుంది. పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ అబ్బవరం కనిపించనున్న ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 


లవ్ .. రొమాన్స్ .. కామెడీ ..  మాస్ డాన్సులు .. ఫైట్లను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి' అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.


Advertisement
Kiran Abbavaram
Athulya Ravi
Meter Movie

More Telugu News