పెళ్లయ్యాక భార్యకు గుబురు గడ్డం.. తట్టుకోలేక విడాకులిచ్చేసిన భర్త
- పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ జీవితంలో అనూహ్య మలుపు
- పెళ్లయ్యాక పెరిగిన గుబురు గడ్డం..విడాకులిచ్చిన భర్త
- దైవ ప్రార్థనతో డిప్రెషన్ నుంచి కోలుకున్న మహిళ
అయితే.. బతుకంతా నిరాశలోనే గడిపేయద్దనుకున్న ఆమె తనలోని మార్పులను సానుకూల ధోరణితో స్వీకరించింది. దైవ ప్రార్థనతో ప్రతికూల భావాలను తొలగించుకుంది. రోజూ గురుద్వారాకు వెళ్లడంతో తనలో మార్పు మొదలైందని మన్‌దీప్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమె గడ్డం తీసుకోవడం కూడా మానేసింది. తనను తొలిసారి చూసిన వారందరూ పురుషుడే అనుకుంటారని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మగాళ్లలాగానే బైక్ నడుపుతానని, తన సోదరులతో కలిసి పొలం పనులకు వెళతానని కూడా ఆమె వివరించింది. ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గతంలోనూ కొందరు మహిళలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. బ్రిటన్‌లో స్లో ప్రాంతానికి చెందిన హర్‌నామ్ కౌర్‌కు పాలీసిస్టిక్ ఓవరీస్ అనే వ్యాధి ఉంది. దీంతో.. చిన్న వయసులోనే ఆమె ముఖంపై రోమాలు మొలవడం ప్రారంభించాయి. తన పదకొండవ ఏటనే ఈ సమస్య మొదలైంది. రోమాలను తొలగించుకునేందుకు ఆమె తరచూ వ్యాక్సింగ్ చేసేది. కొన్నేళ్ల పాటు ఇలా చేసి విసిగిపోయిన హర్‌నామ్ చివరకు పరిస్థితులకు అలవాటు పడటడమే కాకుండా, తన గడ్డాన్ని గర్వంగా ప్రదర్శించేందుకు నిశ్చయించుకుంది.