ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ.. ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టు పట్టించాల్సి వుంది: చంద్రబాబు
- తమ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా చేశారన్న బాబు
- గెలిచిన అభ్యర్థికి ధృవీకరణ పత్రం ఇవ్వకుండా అరెస్టు చేయిస్తావా అని మండిమాటు
- పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై కొనసాగుతున్న ఉత్కంఠ
రాంగోపాల్ రెడ్డిని రాత్రి కౌంటింగ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసిన వీడియోను షేర్ చేశారు. కాగా, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపుపై ఇంకా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో..అర్థరాత్రి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన రాంగోపాల్రెడ్డి, పరిటాల సునీత, శ్రీరామ్, కాల్వ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.