ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ నిఖత్ జరీన్ తొలి పంచ్ అదుర్స్
- గతేడాది ఇదే టోర్నమెంట్ లో స్వర్ణం నెగ్గిన నిఖత్
- ఢిల్లీలో గురువారం మొదలైన తాజా ఎడిషన్
- తొలి రౌండ్ లో అద్భుత విజయం సాధించిన నిఖత్
తొలి రౌండ్ లోనే తన పంచ్ పవర్ చూపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీ) తొలి రౌండ్‌లో అజర్ బైజాన్‌కు చెందిన అనఖనిమ్ ఇస్మాయిలోవాను చిత్తు చేసి తన టైటిల్ వేటను ఆరంభించింది. ఈ బౌట్ లో నిఖత్ జరీన్ పంచ్ ల ధాటికి ప్రత్యర్థి తట్టుకోలేకపోయింది. దాంతో, రెండో రౌండ్ మధ్యలోనే బౌట్ ను నిలిపివేసిన రిఫరీ నిఖత్ ను విజేతగా ప్రకటించాడు. సూపర్ పంచ్ తో హైదరాబాదీ రెండో రౌండ్ లోకి అడుగు పెట్టింది.