జెర్సీ మార్చిన సన్ రైజర్స్.. ఐపీఎల్ లో రాత మారేనా!
- కొత్త జెర్సీని ఆవిష్కరించిన ఫ్రాంచైజీ
- ఈసారి కెప్టెన్ గా ఐడెన్ మార్ క్రమ్
- ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 2023
సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు అతనే ట్రోఫీ అందించాడు. కాగా, ఈ నెల 31న మొదలయ్యే ఐపీఎల్ కొత్త సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా రాజస్థాన్‌తో తలపడనున్నది. కాగా, కొన్నేళ్లుగా సన్ రైజర్స్ ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. గత సీజన్లో కేవలం ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి కొత్త కెప్టెన్, కొత్త జెర్సీలో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో రైజర్స్ రాత మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.