Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విషయంలో వెనక్కి తగ్గిన లాహోర్ హైకోర్టు

Lahore High Court orders not to arrest Imran Khan
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో లాహోర్ హైకోర్టు వెనక్కి తగ్గింది. ఆయనను అరెస్ట్ చేసే విషయంలో కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇమ్రాన్ అరెస్ట్ ను వాయిదా వేయాలంటూ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ నివాసం వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసులతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, లాహోర్ హైకోర్టు ఈమేరకు ఆదేశాలను జారీ చేసింది. గత మంగళ, బుధ వారాల్లో ఇమ్రాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. అయితే ఇమ్రాన్ మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆయనను అరెస్ట్ చేయడం కుదరలేదు.
Go Back to Shorts
Imran Khan
Pakistan

More Telugu News