పెద్దమ్మతల్లి ఆలయంలో సమంత పూజలు

Samantha and Shaakuntalam team worships at Peddamma talli temple
షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్ సమంత బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. శాకుంతలం సినిమా యూనిట్ తో కలిసి ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చే నెల 14న శాకుంతలం సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పెద్దమ్మతల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. హీరోయిన్ సమంతతో పాటు డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమ, దేవ్ మోహన్ లు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో మలయాళీ హీరో దేవ్ మోహన్ కీలకపాత్రలో నటించారు.

ప్రకాశ్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి తదితరులు కీలక పాత్రలలో నటించారు. అంతేకాదు.. ఈ సినిమాలో తొలిసారిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా కనిపించిందని సమాచారం. శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్ ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.
Go Back to Shorts
Samantha
peddamma thalli temple
Hyderabad
shakunthalam
movie pramotions
gunshekar

More Telugu News