ఆటో నగర్ నుంచి వారాహి వాహనంలో మచిలీపట్నం బయల్దేరిన పవన్ కల్యాణ్
- పవన్ జనసేనకు పదేళ్లు
- మచిలీపట్నంలో ఆవిర్భావ సభ
- వారాహితో ఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్
- క్రిక్కిరిసిపోయిన విజయవాడ-బందరు రోడ్డు
- నిదానంగా కదులుతున్న వారాహి
మచిలీపట్నం శివార్లలో దాదాపు 35 ఎకరాల్లో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పవన్ సభాప్రాంగణానికి చేరుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం విజయవాడలో భారీ జనసమూహం నడుమ వారాహి నిదానంగా కదులుతున్న తీరు చూస్తుంటే, పవన్ రాక ఆలస్యమయ్యేట్టుంది. రాత్రి 9 గంటల వరకు జనసేన సభ జరగనుంది.