తల్లి జిరాఫీని చూడగానే పారిపోయిన సింహం!.. వీడియో వైరల్
- నెట్టింట వీడియో వైరల్
- పిల్ల జిరాఫీని కాపాడుకునేందుకు తల్లి జిరాఫీ దాడి
- వీడియోపై నెటిజన్ల అసంతృప్తి
తన పిల్లను కాపాకునేందుకు ప్రాణాలకు తెగించిన తల్లి జిరాఫీ నిజంగా గొప్పదంటూ కొందరు కామెంట్ల వరద పారించారు. ‘‘తల్లి ప్రేమ ఇదే అంటూ’’ అంటూ వరుస వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అయితే సింహం దాడిలో తీవ్రంగా గాయపడ్డ పిల్ల జిరాఫీ వాల్చిన తలను ఎత్తకపోవడాన్ని కొందరు గుర్తించారు. అది అప్పటికే మరణం అంచుకు చేరుకుని ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జీవితం అంటే ఇదేనా.. చంపడం లేదా చావడమేనా’’ అంటూ కొందరు నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే.. ప్రకృతి వీడియోల పేరిట ఇలాంటి సున్నితమైన దృశ్యాలను షేర్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీనిపై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.