Mahbubnagar District: బస్సులోనే ఉరివేసుకున్న ఆర్టీసీ కండక్టర్

Mahbubnagar RTC conductor commits suicide in Bus
షార్ట్స్‌లో చూడండి
ఎప్పటిలాగే ఆదివారం డ్యూటీకి వచ్చిన ఓ ఆర్టీసీ కండక్టర్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నారు. బస్సులోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూర్‌లో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తొర్రూర్ మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తొర్రూర్ ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం యథావిధిగా డ్యూటీకి వచ్చిన ఆయన రిజస్టర్‌లో సంతకం పెట్టి డిపో లోపలికి వెళ్లారు. 

మహేందర్ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది డిపో అంతా గాలించారు. ఈ క్రమంలో ఆయన ఓ బస్సులో విగతజీవిగా కనిపించాడు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. మహేందర్ ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారనేది ఇంకా తెలియరాలేదు. విధుల్లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక వ్యక్తితగ కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Go Back to Shorts
Mahbubnagar District

More Telugu News