Mumbai Indians: హర్మన్ ప్రీత్ అదుర్స్... ఎదురులేని ముంబయి ఇండియన్స్

Mumbai Indians unbeatable in WPL
షార్ట్స్‌లో చూడండి
డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ అమ్మాయిలు మరో విజయం నమోదు చేశారు. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ జయభేరి మోగించింది. 160 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి కేవలం 17.3 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధసెంచరీతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడింది. హర్మన్ ప్రీత్ 33 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. 

ఓపెనర్ యస్తికా భాటియా (42), నాట్ షివర్ (45 నాటౌట్) రాణించడంతో ముంబయి సునాయాసంగా గెలిచింది. చివర్లో నాట్ షివర్ సిక్స్ తో విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్ ముగించడం విశేషం. యూపీ వారియర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 1, సోఫీ ఎక్సెల్ స్టోన్ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు తాను ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. యూపీ వారియర్స్ తో మ్యాచ్ అనంతరం... మొత్తం 4 మ్యాచ్ ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
Go Back to Shorts
Mumbai Indians
Harmanpreet Kaur
UP Warroirz
WPL

More Telugu News