ఎప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లినా పవన్ ఏదో ఒక దీక్షతో పనిచేస్తుండేవాడు: రాఘవేంద్రరావు

  • మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
  • 27 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న పవన్ 
  • కొన్ని కోట్ల మంది జనాలను మెప్పించాడన్న రాఘవేంద్రరావు
  • ఆల్ ది బెస్ట్ పవన్ కల్యాణ్ అంటూ సందేశం
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం, పవన్ కల్యాణ్ 27 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్పందించారు. 

పవన్ కల్యాణ్ చిన్నప్పటి నుంచి తనకు బాగా తెలుసు అని రాఘవేంద్రరావు వెల్లడించారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్లినప్పుడల్లా పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఏదో ఒక దీక్షతో పనిచేస్తున్నట్టు కనిపించేవాడని తెలిపారు. అదే దీక్షతో, అదే పట్టుదలతో సినిమా హీరోగా 27 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు అభినందిస్తున్నానని పేర్కొన్నారు. 

"ఒక కథానాయకుడిగా కొన్ని కోట్ల మంది జనాలను మెప్పించి, ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు, ఆయన టీమ్ కు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ పవన్ కల్యాణ్" అంటూ రాఘవేంద్రరావు తన సందేశం వెలువరించారు.

Raghavendrarao
Pawan Kalyan
Powerstar
Janasena

More Telugu News