భర్తతో కలిసి భారీ కాన్వాయ్ తో ఈడీ ఆఫీసుకు చేరుకున్న కవిత.. వీడియో ఇదిగో

లిక్కర్ స్కామ్ లో విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న తన తండ్రి నివాసం నుంచి ఆమె ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. కేసీఆర్ నివాసం వెలుపల భారీ సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కవితకు అనుకూలంగా నినాదాలు చేశారు. కవిత భర్త అనిల్, లాయర్ మోహన్ రావు కూడా ఆమెతో పాటు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 

మొత్తం 10 వాహనాల కాన్వాయ్ తో కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పిడికిలి బిగిస్తూ ఆమె ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను కూడా దూరంగా వెళ్లమని పోలీసు అధికారులు చెపుతున్నారు.

K Kavitha
BRS
Delhi Liquor Scam
Enforcement Directorate

More Telugu News