TV Ramarao: వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై ఆయన తన అనుచరులతో సమావేశమై చర్చిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఒక కేసులో ఇరుక్కుని రాజకీయంగా చాలా ఇబ్బందులు పడ్డారు. 2014లో ఆయనకు టీడీపీ టికెట్ రాకపోయినప్పటికీ జవహర్ కు మద్దతుగా ప్రచారం చేసి టీడీపీ విజయానికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో 2019లోనే ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనిత గెలుపు కోసం కృషి చేశారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా కనిపించడం లేదు. మరోవైపు ఆయన ఏ పార్టీలో చేరతారనే చర్చ జరుగుతోంది.
TV Ramarao
Telugudesam
YSRCP

More Telugu News